“ఆటోనగర్ సమంత” ఫుల్ మాస్


యువ సామ్రాట్ నాగ చైతన్య మరియు అందాల తార సమంతలు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “ఆటో నగర్ సూర్య” ఈ చిత్రానికి దేవ్ కట్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్రంలో సమంత కొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు క్లాస్ పాత్రలు చేసిన ఈ భామ ఈ చిత్రంలో కామెడి టచ్ ఉన్న పూర్తి మాస్ పాత్రలో సమంత నటిస్తున్నారు. కే.అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సంవత్సరం రెండవ భాగంలో ఈ చిత్రం విడుదల కానుంది.

Exit mobile version