లండన్ పర్యటనలో సమంతకు చేదు అనుభవం

సమంతకు ఈ మధ్యనే లండన్ పర్యటన చేదు అనుభవం మిగిల్చింది. ఇక్కడ నందిని రెడ్డి చిత్రం మొదటి షెడ్యూల్ మీ ముగించుకొని లండన్ బయలుదేరిన సమంత తన సామగ్రి ని క్యతర్ విమానాశ్రయ సిబంది పోగొట్టారు. “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్ర చిత్రీకరణకు వెళ్ళిన సమంత ” ఖతర్ సిబ్బంది నిర్లక్ష్యం మూలాన నా పర్యటన దెబ్బతినింది. నా లగేజ్ పోయింది. చాల బాధాకర విషయం” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్వరలో సమంత ఇండియా చేరుకోనున్నారు రాజమౌళి “ఈగ” ఆడియో విడుదల వేడుకలో పాల్గొననున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర పట్ల సమంత ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. ఈ చిత్ర ఆడియో మార్చ్ ౩౦న విడుదల కానుంది. చిత్రం వేసవిలో విడుదల అవుతుంది.

Exit mobile version