దగ్గుపాటి రానా మరియు జెనీలియా జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా ఇష్టం’ గత వారం విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర సాటిలైట్ హక్కులు జెమిని టీవీ 3 కోట్ల 20 లక్షలకు రూపాయలకు దక్కించుకుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇది అత్యధికం అని చెప్పుకోవాలి. చిన్న నిర్మాతలకు కూడా కొత్త ఊపిరి ఇచ్చి మారి కొన్ని సినిమాలు తీసేలా ధైర్యన్నిస్తుంది. రానా, జెనీలియాతో పాటుగా హర్షవర్ధన్ రాణే కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంతో ప్రకాష్ తోలేటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. చక్రి సంగీతం అందించిన నా ఇష్టం చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించాడు.