ఉషాకిరణ్ సంస్థ నిర్మించిన ‘ఇష్టం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన చరణ్ ఈ ఉదయం గుండె పోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి నిద్రలోనే స్పృహ కోల్పోయిన అతన్ని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఇష్టం సినిమా ద్వారానే శ్రియ కూడా హీరొయిన్ గా పరిచయమైంది. ఈ పరిణామానికి షాక్ కు గురైన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలిపారు.