నా ఇష్టం సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న బబ్లీ బ్యూటీ


తెలుగు ప్రేక్షకుల్లో బబ్లీ బ్యూటీ జెనీలియాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె తెలుగులో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించడంతో ఆమెను అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. జెనీలియా చిలిపితనం, ఎనర్జిటిక్ నటనతో మరోసారి మన ముందుకు రాబోతుంది. రానా సరసన ‘నా ఇష్టం’ అనే సినిమాలో నటిస్తుంది. గతంలో ఆమె ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఎంతటి చక్కటి నటన ప్రధర్శించిందో మనకు తెలిసిందే. అదే స్థాయిలో నా ఇష్టం లో కూడా నటించినట్లు ఆమె చెబుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకుంది. మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో మాత్రం తెలియదు. నా ఇష్టం చిత్రానికి ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహించగా పరుచూరి కిరీటి నిర్మించాడు.

Exit mobile version