విమర్శకులు మెచ్చే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణం వందే జగద్గురుం’. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రానా సరసన నటించబోయే హీరొయిన్ కోసం గత కొద్ది రోజులుగా వెతుకుతున్నారు. చివరికి రానా హీరొయిన్ దొరికింది. ఆమె ఎవరో కాదు నయనతార. ఇటీవలే ‘శ్రీ రామరాజ్యం’ చిత్రంతో అటు విమర్శకుల ప్రశంసలు మరియు ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకున్న ఆమె సినిమాల్లో నటించను అని ప్రకటించి మళ్లీ మేకప్ రాసుకోబోతుంది. రానా సరసన హీరొయిన్ కోసం పలువురు హీరోయిన్లను ప్రయత్నించినప్పటికీ చివరికి ఆ వక్షం నయనతారని వరించింది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో రానా పాత్ర పేరు బీటెక్ బాబు.