గత కొద్ది వారాలుగా తరువాత చిత్రం కోసం ఆలోచనలో పడ్డ అమలా పాల్ ఎట్టకేలకు ఒక చిత్రం ఒప్పుకుంది. “వేట్టై” మరియు “లవ్ ఫెయిల్యూర్” చిత్రాల విజయం తరువాత తెలుగు మరియు తమిళ పరిశ్రమ లో ముఖ్య తారగా మారింది. రామ్ చరణ్ మరియు వి.వి.వినాయక్ ల చిత్రంలో కనిపించబోతుంది. ప్రస్తుతం మాకు అందిన సమాచారం ప్రకారం ఈ భామ తమిళం లో ఒక చిత్రం ఒప్పుకున్నారు జయం రవి సరసన చెయ్యబోయే ఈ చిత్రం పేరు “భూలోగం”. ప్రముఖ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో జయం రవి కిక్ బాక్సర్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఎం.కళ్యాణ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ రెండు చిత్రాలు కాకుండా అమలా పాల్ “ఆకశాతింటే నిరం” మరియు “డైమండ్ నెక్లస్” అనే రెండు మళయాళ చిత్రాలు కూడా ఒప్పుకున్నారు.