ప్రత్యేకం: “మిస్టర్ సెవెన్”గా రాబోతున్న జూనియర్ ఎస్ వి రంగా రావు

ప్రముఖ నటుడు ఎస్ వి రంగారావు మనవడు జూనియర్ ఎస్ వి రంగారావు తెర ఆరంగేట్రం చెయ్యటానికి సకలం సిద్దం అయ్యింది 123తెలుగు.కాం కి అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “మిస్టర్ సెవెన్” గా పేరు పెట్టారు. ఆర్ చరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. నీలం ఉపాధ్యాయ ఈ చిత్రంతో తెరకు పరిచయం కానుంది. ఈ మధ్యనే ఒకానొక పోరాట సన్నివేశంలో జూనియర్ ఎస్ వి ఆర్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నట్టు తెలిపారు. జూనియర్ ఎస్ వి ఆర్ ని తెరకు హీరోగా పరిచయం చెయ్యటం కోసమే స్థాపించిన ఎస్ వి ఆర్ సిని గ్రూప్ బ్యానర్ మీద నిర్మిస్తున్న. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version