లవ్లీ పాటలని పొగుడుతున్న ఇండస్ట్రీ ప్రముఖులు

విలక్షణ నటుడు సాయి కుమార్ అబ్బాయి అయిన యంగ్ హీరో ఆది నటించిన ‘లవ్లీ’ సినిమాని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు పొగిడారు. ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో ఈ చిత్ర పాటల ప్రత్యేక ప్రివ్యూ వేయగా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆది మరియు శాన్వి జంటగా నటించిన ఈ చిత్రంలో చిన్మయి ఘట్రాజు మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు దిల్ రాజు, బెల్లంకొండ సురేష్, బండ్ల గణేష్ బాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, హరీష్ శంకర్, చిన్ని కృష్ణ మరియు పలువురు ప్రముఖులు ఈ ప్రివ్యూకి హాజరై నిర్మాత బి.ఎ. రాజు మరియు దర్శకురాలు బి. జయని అభినందించారు. నిర్మాత బి.ఎ. రాజు చిత్రం పట్ల పూర్తి నమ్మకంతో చాలా సంతోషంగా ఉన్నారు.

Exit mobile version