యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్ర ఆడియో ఉగాది కానుకగా మార్చి 23న విడుదల చేయాలనీ భావించినప్పటికీ ఈ వేడుకని 29 కి వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఆడియో విడుదల వాయిదా వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించగా ఇటీవలే రీరికార్డింగ్ చేయడం ప్రారంభించారు. దమ్ములో ఎన్టీఆర్ సరసన త్రిషా కార్తీక నటిస్తుండగా సుమన్ మరియు భానుప్రియ ఎన్టీఆర్ తల్లితండ్రులుగా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలెగ్జాన్డర్ వల్లభ నిర్మాత.