అక్కినేని అభిమానుల కల నెరవేరబోతుంది

తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు మరియు తనయుడు నాగ చైతన్య ల తో కలిసి ఒక చిత్రం చేయ్యబోతున్నానని కింగ్ నాగార్జున ప్రకటించారు. ఇక్కడ నెల్లూరు లో జరిగిన ఒక పత్రిక విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ” ఇది నా కలల చిత్రం ,ప్రస్తుతం కథలు వింటున్నాం వచ్చే సంవత్సరం ఈ చిత్రం ప్రారంభం అవ్వచ్చు” అని అన్నారు. గతం లో ఈ కృష్ణ వంశీ దర్శకత్వం లో వీరు ముగ్గురు కలిసి ఒక చిత్రం చేస్తున్నారని పుకారు ఉంది. కాని అది జరగలేదు ప్రస్తుతం నాగార్జున “షిరిడి సాయి” చిత్రం చేస్తున్నారు. నాగ చైతన్య దేవ్ కట్ట దర్శకత్వం లో “ఆటో నగర్ సూర్య” చిత్రం ఇది అయిపోగానే రాధా మోహన్ దర్శకత్వం లో వస్తున్న ద్విభాషా చిత్రం “గౌరవం” లో నటిస్తున్నారు ఈ ముగ్గురు ఒకే చిత్రం లో కనిపిస్తే అక్కినేని వంశ అభిమానులకు కన్నుల పండుగే.

Exit mobile version