కమెడియన్ సునీల్ హీరోగా మారి చేసిన నాలుగు సినిమాల్లో మూడు విజయాలు సాధించాయి. సురేష్ ప్రొడక్షన్లో సునీల్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. తాప్సీ హీరొయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించనున్నాడు. ఉదయ్ శంకర్ గతంలో సురేష్ ప్రొడక్షన్లో కలిసుందాం రా వంటి హిట్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సురేష్ ప్రొడక్షన్లో రాజేంద్ర ప్రసాద్, నరేష్, జే డి చక్రవర్తి వంటి హీరోలు గా పరిచయమై నిలదొక్కుకున్నారు. సునీల్ నటించిన పూల రంగడు చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఇదే కాకా ఇషా చావ్లాతో తను వెడ్స్ మను రిమేక్‌లో కూడా నటించనున్న విషయం తెలిసిందే.