మళ్లీ ట్విట్టర్లో అడుగు పెట్టిన సమంతా


అందాల భామ సమంతా దాదాపు సంవత్సరం తరువాత సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. గతంలో ఆమె ట్విట్టర్ వాడేది కాని ఫ్యాన్స్ నుండి వివాదాస్పద ట్వీట్స్ వస్తుండటంతో ఆమె తన అకౌంటు తొలగించింది. ప్రస్తుతం ఆమె సమంతాప్రభు 2 అనే కొత్త అకౌంటు క్రియేట్ చేసింది. అగ్ర దర్శకుడు రాజమౌళి, దేవ కట్టా, రామ్, త్రిషా, రానా, లక్షి మంచు ఇతర ప్రముఖులు ఆమెను ట్విట్టర్ కి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసారు. సమంతా ఇటీవల కొంత మారినట్లుగా కనిపిస్తుంది. మహేష్ బాబు సరసన దూకుడు భారీ విజయం సాధించడంతో ఆమె అగ్ర తరాల సరసన చేరిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఈగ’, ‘ఎవడు’, మణిరత్నం దర్శకత్వంలో ‘కాదల్’ మరియు గౌతం మీనన్ రూపొందిస్తున్న ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రాల్లో నటిస్తుంది.

Exit mobile version