రామోజీ ఫిలిం సిటీలో దమ్ము ఇంటర్వెల్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఇంటర్వెల్ కి సంభందించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సన్నివేశాలు బోయపాటి శ్రీను మరియు రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తుంది. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ సమర్పణలో అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దమ్ము చిత్ర ఆడియో ఈ నెల 23 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version