పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల మార్చి 9 నుండి ఈ చిత్రానికి సంభందించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నీ వేషాలు చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం తను కొన్ని ఆసక్తికరమైన సలహాలు ఇస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్ముస్తుండగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అలరిస్తూ తప్పక భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు. శృతి హసన్ హీరొయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.