తెలుగులో డబ్ కానున్న వెట్టై

లింగు స్వామి దర్శకత్వం వహించి ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం ‘వెట్టై’. ఈ చిత్రం తెలుగులోకి అనువదించనున్నారు. ఈ చిత్రానికిగాను ‘భలే తమ్ముడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఆర్య, మాధవన్, అమలా పాల్, సమీర రెడ్డి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ్లో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేయనున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో యూటీవీ ప్రతినిధులు జి. ధనుంజయ్, ఎస్.పి శివ మాట్లాడుతూ ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో మార్చి మూడవ వారంలో విడుదల కానుంది.

Exit mobile version