క్వారీలో షూటింగ్ జరుపుకుంటున్న కళ్యాణ్ రామ్ 3డి సినిమా

కళ్యాణ్ రామ్ ప్రస్తుం ‘ఓం’ అనే 3డి సినిమాలో బిజీగా ఉన్నారు. హైదరాబాదు శివార్లలోని ఒక క్వారీలో ఈ చిత్రానికి సంబందించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటిస్తూ తనే స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సుని రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పలు విభిన్నమైన గెటప్స్ తో కనిపించనున్నాడు.

Exit mobile version