ప్రత్యేకం : ఈగ విడుదల తేదీ ఖరారు!


ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఈగ’ చిత్రానికి సంబంచిన విడుదల తేదీ గురించిన సమాచారం మాకు ప్రత్యేకంగా లభించింది. సోషియో ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 12 భారీ విడుదలకు సిద్ధమవుతుంది. సాంకేతికంగా భారీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మోషన్ కెమేరా లాంటి పలు సాంకేతిక అంశాలు మెండుగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంతా, నాని, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈగ చిత్రానికి సంభందించిన ప్రత్యేక అప్డేట్స్ కోసం 123తెలుగు.కామ్ చూస్తుండండి.

Exit mobile version