ఇంటర్నెట్ పైరసీ మరోసారి తన ప్రతాపం చూపించింది “రచ్చ” ఆడియో హక్కులను ఒక కోటి రూపాయాలకు ఆదిత్య సొంతం చేసుకుంది కాని కొన్ని రోజుల క్రితం రచ్చ టైటిల్ సాంగ్ ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ల ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది.ఈ విషయం పై యాంటి పైరసీ బృందం స్పందించింది ఆ పాటను ఇంటర్నెట్ లో పెట్టిన వారిని అరెస్ట్ చేసింది ఆ పాటని ఇంటర్నెట్ నుండి తీయించింది ఈ విషయం మీద ఎవిపిసి అద్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ పని చేసిన అతను లొంగిపోయాడు టాస్క్ ఫోర్సు వారికి ఈ విషయం పై సహాయం చేస్తాను అని కూడా చెప్పాడు. పైరసీ ని అడ్డుకోడానికి మేము మా సాయశక్తుల కృషి చేస్తున్నాం ఈ మధ్య వచ్చిన చిత్రాలు బిజినెస్ మాన్,బాడి గార్డ్ మరియు రాజన్న చిత్రాల పైరసీ రాకుండా చాలా కృషి చేశాం అని అన్నారు.