వెంకి ని సందర్శించిన రజని

rajinikanth latha rajinikanth 20 10 11
కాదండోయ్… అది విక్టరీ వెంకటేష్ అనుకున్నారా..! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు. తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శించుకున్నారు. స్వామివారి దీవెనలు కోరుకుని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. అతని సమాన బరువైన 75 కిలోల కలాకండ్ ను స్వామి వారికి సమర్పించారు. రజినీకాంత్ వెంట శ్రీవారిని దర్శించుకున్నవారిలో భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య మరియు సౌందర్య, అల్లుళ్ళు ధనుష్, అశ్విన్, అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉన్నారు.

తానూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని త్వరలోనే రానా సినిమా షూటింగ్ లో పాల్గొంటానని రజినీకాంత్ ఈ సందర్భంగా విలేఖరులకు తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్న అందరికీ రజని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త త్వరగా కోలుకున్నందుకు ప్రతిగా, రజినీకాంత్ భార్య లత శ్రీవారికి తలనీలాలు సమర్పించి తన మొక్కు తీర్చుకున్నారు.

స్వామి వారి సన్నిధిలో సుమారు 30 నిమిషాలు గడిపిన అనంతరం రజని చెన్నై కు తిరుగు పయనమయ్యారు.

Exit mobile version