పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘8 వసంతాలు’ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. అనంతిక సనీల్‌కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ మెటీరియల్ చూస్తుంటే ఈ కథంతా మీ చుట్టూనే ఉంటుందనిపిస్తుంది?
ఇది విమెన్ కి సంబంధించిన కథ. కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత వుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ కి లేయర్స్ ఉంటాయి.
మ్యాడ్ తర్వాత ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం?
మంచి కథ కోసం వెయిట్ చేశాను. ఈ కథలో నేను కోరుకున్న ప్రతిదీ ఉంది. నాకు యాక్షన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఈ కథలోనే కుదిరాయి. ఫర్ఫార్మెన్స్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్.
ఈ ప్రేమ కథలో ప్రత్యేకత ఏమిటి ?
చాలా ప్యూర్ లవ్ స్టోరీ ఇది. రియల్ ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ కి రిలేట్ అవుతుంది.
మిగతా నటీనటుల గురించి?
హను రెడ్డి వెరీ గుడ్ యాక్టర్ . చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారు. రవి కూడా చాలా మంచి యాక్టర్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సులువుగా చెప్పగలరు.
డైరెక్టర్ ఫణీంద్ర గురించి?
ఫణీంద్ర గారు నాకు గురువు లాంటి వారు. ఈ జర్నీలో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన క్లియర్ విజన్ తో ఉంటారు. చాలా పాషనేట్ ఫిలిం మేకర్. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.
మైత్రి మూవీ మేకర్స్ గురించి?
మైత్రి మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టులో తీసుకున్నందుకు నిర్మాతలకు థాంక్స్ చెప్తున్నాను. ఈ జర్నీలో చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి సినిమాని తీయడానికి చాలా గట్స్ కావాలి.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను.