సాయి తేజ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన జీ.!

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరోల్లో మెగాస్టార్ మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. కెరీర్ ఆరంభంలో మంచి గ్రాఫ్ ను నమోదు చేసుకున్న ఈ హీరో తర్వాత డౌన్ అయ్యాడు. కానీ ఇటీవలే చిత్ర లహరి, ప్రతీరోజూ పండగే సినిమాలతో మంచి విజయాలు అందుకొని హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేసిన చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”.

నూతన దర్శకుడు సుబ్బుతో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా విడుదల పట్ల కూడా చాలానే హాట్ టాపిక్ నడిచింది. కానీ ఫైనల్ గా మాత్రం ఓటిటి రిలీజ్ కాదని థియేట్రికల్ రిలీజ్ కే మేకర్స్ ఫిక్సయ్యారు. ఇప్పుడు ఇదే విషయాన్ని అప్పుడు మంచి ఓటిటి ఆఫర్ ఇచ్చిన సంస్థ “జీ” వారు కూడా క్లారిఫై చేసారు.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారితో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అలాగే ఈ చిత్రం వచ్చే డిసెంబర్ లో విడుదల కానున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అలాగే దీనిపై సాయి తేజ్ మాట్లాడుతూ జీ గ్రూప్ వారు మా సినిమాతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక అలాగే ఫైనల్ గా ఈ చిత్రం థియేటర్స్ లోనే విడుదల కానుంది అని కంక్లూజన్ ఇచ్చారు. ఇక ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు థమన్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే మంచి ప్లస్ అయ్యిన సంగతి తెలిసిందే.

Exit mobile version