‘రేయ్’ సినిమాను ప్రచారం చెయ్యడానికి వై.వి.ఎస్ చౌదరి ఏ ఒక్క దారిని వదలడంలేదు. సాయి ధరమ్ తేజ, సయామి ఖేర్ మరియు శ్రద్దా దాస్ లు నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదలకానున్న నేపధ్యంలో అప్పటివరకూ ప్రేక్షకులకు ఈ సినిమాపై దృష్టినిలిపడానికి ప్రయత్నిస్తున్నాడు
ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఫీలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ కు చౌదరిగారు చాలా సంతోషంగా వున్నాడు. వీటిలో మూడవ ఫీలర్ డిసెంబర్ 22న సాయింత్రం 6గంటలకు విడుదలచేస్తానని, అధి అభిమానులకు పండగ అని తెలిపాడు. దశల వారీగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ను విడుదలచేస్తున్నారు
చక్రి సంగీత దర్శకుడు. చౌదరిగారే ఈ సినిమాకు నిర్మాత. ‘రేయ్’ సినిమా కరేబియన్ దీవుల నేపధ్యంలో సాగనున్న ఒక మ్యూజికల్ ప్రేమకధ