భారీ ఓపెనింగ్స్ సాదించనున్న ఎటో వెళ్లిపోయింది మనసు

Yeto-velli-poyindi-Manasu
గౌతం మీనన్ తాజా చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు” డిసెంబర్ 14 విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్ర ఆంధ్ర ప్రదేశ్ అంతటా ప్రధాన నగరాలలో మంచి వసూళ్లు రాబట్టనుంది. నాని మరియు సమంత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటించారు. సి కళ్యాణ్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని నిర్మించగా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈరోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చిత్రాన్ని 500 ధియేటర్లలో విడుదల చేస్తున్నట్టు అమెరికాలో 51 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నాని కెరీర్లో భారీగా విడుదలైన చిత్రాలలో ఇది ఒకటి కానుంది. ఇదిలా ఉండగా చెన్నైలో సమంత చిత్ర బృందంతో కలిసి తమిళ వెర్షన్ చిత్రాన్ని తిలకించారు. చిత్ర బృందం మొత్తం ఈ చిత్రాన్ని గత రెండు రోజులుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version