సెన్సార్ పూర్తి చేసుకున్న ఎటో వెళ్ళిపోయింది మనసు


టాలీవుడ్ యంగ్ హీరో నాని, అందాల భామ సమంత జంటగా నటించిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఎలాంటి కట్స్ విధించలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కిన ఈ సినిమా తమిళ వెర్షన్లో జీవా హీరోగా నటించాడు. గౌతం మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకి సి.కళ్యాణ్ నిర్మాత.

డిసెంబర్ 14న బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి పోటీగా సాయిరామ్ శంకర్, శ్రీహరి, పార్వతి మెల్టన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘యమహో యమః’ సినిమా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలలో ఒకదానితో ఒకదానికి పొంతన లేకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద ఏది హిట్ గా నిలుస్తుందో అనేది వేచి చూడాలి.

Exit mobile version