ఏ.ఆర్ రెహమాన్, ఇళయరాజా మరియు జి.వి ప్రకాష్ ల తరువాత మరో దక్షినాది సంగీత దర్శకుడు బాలీవుడ్ కు స్వరాలు అందించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం మన యువన్ హిందీలో ఇమ్రాన్ హష్మి నటించబోతున్న సినిమాలకు సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాకు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ముంబైలో జరగనున్నాయి. కునాల్ దేశముఖ్ ఈ సినిమాను దర్శకత్వం విహిస్తుండగా యు.టి.వి మోషన్ పిక్చర్స్ నిర్మాత. చాలా కాలంగా యువన్ తెలుగు మరియు తమిళ సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. దాదాపు పది సంవత్సరాల తరువాత అతని కన్ను బాలీవుడ్ పై పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో కుడా తన స్వరాలతో మాయాజాలం చేస్తాడేమో చూడాలి