రాజకీయ నేపధ్యంలో సాగే “యువనేత”


యువతరం రాజకీయాలలోకి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న కధంశంతో రూపొందిన చిత్రం “యువనేత”.సురేష్, హిమబిందు జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హన్మంతరావు దర్శకత్వం వహించారు. లలిత్ సురేష్ అందించిన సంగీతం చాలా బాగుంది అని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార పగ్గాలు యువత చేపడితేనే సాధ్యం, ఇదే విషయాన్నీ ఈ చిత్రంలో ప్రస్తావించం అని నిర్మాతలు అన్నారు. రాజకీయ నేపధ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉండబోతుందని ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version