అఖండ 2 : ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడొస్తుంది..?

Akhanda-2

టాలీవుడ్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఇటీవల కొన్ని కారణాల వల్ల తమ రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ఘాటి’ తదితర చిత్రాలు తమ రిలీజ్ డేట్‌ను మార్చుకున్నాయి. ఇక కొన్ని సినిమాలు మాత్రం తాము ముందుగా చెప్పిన డేట్‌కే వస్తామని ఆయా చిత్రాల మేకర్స్ చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న డేట్ ఏదైనా ఉందంటే, అది ఖచ్చితంగా సెప్టెంబర్ 25 అని చెప్పాలి. ఆ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజి’ రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దూసుకుపోతుంది ఈ చిత్రం. అయితే, అదే రోజు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ చిత్రం ‘అఖండ 2’ కూడా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం.. సినిమా చాలా ఆలస్యం అవుతుండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

మరి నిజంగానే ఓజి లాంటి సినిమాతో అఖండ 2 పోటీ పడుతుందా.. పోని తమ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేయాలని అఖండ 2 మేకర్స్ భావిస్తున్నారా..? ఏ విషయమైనా వారు ఒక్క క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి వారు ఎదురుచూసే ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

Exit mobile version