రజినీ, కమల్ మల్టీస్టారర్ పై యంగ్ దర్శకుడు క్లారిటీ?

Kamal, Rajini

రీసెంట్ గా సోషల్ మీడియా సహా సినీ వర్గాలని షేక్ చేసిన క్రేజీ వార్తల్లో బిగ్ స్టార్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే, కమల్ హాసన్ ల మల్టీస్టారర్ కోసం అని చెప్పవచ్చు. మరి ఈ చిత్రంని సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడని మొదట రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత లేదని మళ్ళీ వినిపించింది. ఇక ఈ భారీ కాంబినేషన్ ని చేసే మరో దర్శకుడు ఎవరు అనే టాక్ ఇప్పటికీ ఉంది.

అయితే అలా వచ్చిన కొన్ని పేర్లలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అలాగే హీరో ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా వచ్చింది. అయితే ఈ యంగ్ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ విషయంలో నిజం లేదని చెబుతున్నట్టు తమిళ సినిమా వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తాను నటన మీద మాత్రమే ఫోకస్ గా ఉన్నానని దర్శకునిగా సినిమాలు చేయడం లేదని సో ఈ కాంబినేషన్ దర్శకుడు తాను కాదని చెప్పినట్టు టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version