స్విట్జర్ల్యాండ్ వెళ్లనున్నది ఎవడు?

Yevadu1
రామ్ చరణ్ తాజా సినిమా ‘ఎవడు’ స్విట్జర్ల్యాండ్లో షూటింగ్ జరుపుకోవడానికి బయల్దేరనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ మరియు యమీ జాక్సన్ హీరోయిన్స్. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో ముఖ్య పాత్రలలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఇప్పటికే చాలావరకూ టాకీ భాగం ముగించుకున్న ఈ చిత్రం ఇప్పుడు హీరో, హీరొయిన్ల సరసన ఒక కొత్త పాట చిత్రీకరణ కోసం స్విట్జర్ల్యాండ్ వెళ్లనుంది. శృతి హాసన్ ఈరోజు రాత్రి స్విట్జర్ల్యాండ్ కు బయల్దేరుతుంది. ప్రస్తుతం కేన్స్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడనుండి షూటింగ్లో జతకట్టనున్నాడు. దిల్ రాజు నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ యేడాదిలో ‘నాయక్’ తరువాత విడుదలకబోతున్న రామ్ చరణ్ భారీ చిత్రం ఇది.

Exit mobile version