మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా కొత్త షెడ్యూల్ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని కొంత భాగం ఇప్పటికే హైదరాబాద్, వైజాగ్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలోప్రధాన పాత్ర కోసం తీసుకున్న సమంత స్థానంలో ఇప్పుడు శృతి హసన్ నటిస్తోంది. ఈ షెడ్యూల్ నుండే శృతి ఈ టీంతో కలిసి పనిచేయనుంది.
ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ – శృతి హసన్ పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సెకండ్ హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2013 ఏప్రిల్ లో విడుదల చేయానున్నామని వంశీ పైడిపల్లి ఇది వరకే తెలిపాడు.