అంచనాలు లేకపోవడం ‘ఎవడు’కు వరమా??

అంచనాలు లేకపోవడం ‘ఎవడు’కు వరమా??

Published on Dec 24, 2013 4:00 AM IST

yevadu
చాలా సందర్భాలలో భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఇది ఒక ఎత్తైతే అసలు అంచనాలు లేని సినిమాలు ఘన విజయాన్ని అందిచాయి

చాలామంది ట్రేడ్ పండితుల ప్రకారం మెగాపవర్ స్టార్ ‘ఎవడు’ విషయంలో ఇటువంటిది ఏదో జరగనుందట. రాష్ట్ర రాజకీయాల నేపధ్యంలో దాదాపు 6నెలలు వాయిదాపడి అభిమానుల, సినీప్రియుల అంచనాలను తగ్గించేసింది. ఆడియో రిలీజ్ అయ్యి ఇంత విరామం వస్తే అది ఏ సినిమాకూ మంచిదికాదు

కాకపోతే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వస్తుందిగనుక మొదటి రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని, సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది గనుక డబ్బులకు డోకా లేదని పంపిణీదారుల అభిప్రాయం. రామ్ చరణ్, శృతిహాసన్, అమీ జాక్సన్ ప్రధానపాత్రధారులు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత

దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో అతిధి పాత్రల్లో మెరిసారు.

తాజా వార్తలు