ఎవడు దర్శకుడి సినిమా: దిల్ రాజు

dil_raju
రామ్ చరణ్ నటించిన ఎవడు ఈనెల 12న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారకార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు

ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ “కాస్త విరామం తరువాత సినిమాను మీముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఈ నెలలో సినిమా బృందం స్పెషల్ షో ను చూశాక వారి నమ్మకం రెట్టింపయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా చిరంజీవిగారికి, అల్లు అరవింద్ గారికి చాలా నచ్చింది. ఇధి దర్శకుడి సినిమా. వంశీ పైడిపల్లి ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు”. దర్శకుడు మాట్లాడుతూ “నా బృందం లేకుండా నేను ఈ సినిమా చేయగలిగేవాడినేకాదు. ఈ సినిమాపై తమ మనసుపెట్టి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు ధన్యవాదాలు”అని తెలిపాడు

శృతిహాసన్ హీరోయిన్. కాజల్ అతిధిపాత్ర పోషించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు

Exit mobile version