కొద్ది రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న… ప్రశ్న మే 20న ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో వస్తుందా లేదా? ఈ సందేహం వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పుట్టిన రోజు ఇంకా ఎంతో దూరం లేదు. అయినా రాజమౌళి నుండి దీనిపైనా ఎటువంటి ప్రకటన లేదు. ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ఉంటుంది, లేనిది చెప్పడం లేదు. ఐతే ఈ విషయం పై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్కంఠకు ఆయన తెరదింపారు. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు చరిత్రకు ఫిక్షన్ జోడించి రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిర్మాత డి వి వి దానయ్య 400కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇక అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.