శర్వానంద్ మరియు నిత్యమీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “ఏమిటో ఈ మాయ” చిత్ర డిసెంబర్ 16న చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. జాతీయ అవార్డు గ్రహీత చేరన్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దర్శకత్వం వహించనున్నారు. చేరన్ దర్శకత్వం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది గతంలో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన “నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” చిత్రానికి కథ మరియు కథనం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు. శర్వానంద్ కథలను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు, నిత్య మీనన్ కూడా అలానే ఎంపిక చేసుకుంటున్నారు. దీనికి చేరన్ టేకింగ్ తోడవుతుండటంతో చిత్రం మీద ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి.