బాక్స్ ఆఫీసు వద్ద అల్లరోడి సినిమాకి మంచి రెస్పాన్స్

Yamudiki Mogudu (1)
ఈ వారం విడుదలైన సినిమాల్లో కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాకి విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్ రావడం, మిగిలిన రెండు సినిమాలు కొన్ని వర్గాల వారినే ఆకట్టుకోవడంతో యముడికి మొగుడు సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. ‘సుడిగాడు’ లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లరి నరేష్ చేసిన ఈ సినిమా కూడా విజయం సాదించడంతో ఇండస్ట్రీలో నరేష్ కి ఉన్న మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు ని మరో సారి నిరూపించుకున్నాడు.

ఆలాగే నరేష్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. రిచా పనాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయాజీ షిండే, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కోటి సంగీతం అందించగా, ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అడ్డాల చంటి నిర్మాత.

Exit mobile version