“గౌరవం” చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యామి గౌతం చిత్రీకరణ సమయంలో గాయపడ్డారు. ఈ చిత్రంలో ఒకానొక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.చిన్న గాయం కాకపోవడంతో చిత్ర బృందం మొత్తం ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో పడింది. వైద్యం కోసం డాక్టర్ ని పిలిపించారు, ఆశ్చర్యకరంగా యామి నొప్పి తగ్గడానికి మందులు ఇవ్వండి ఈరోజు చిత్రీకరణకు నా మూలాన ఇబ్బంది కలగకూడదు అని అన్నారు. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ హీరోగా పరిచయమవనున్నారు. ఈ చిత్రంలో అయన పేరు అర్జున్ అని సమాచారం, డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర బృందం త్వరలో మరొక షెడ్యూల్ కోసం కన్యాకుమారి పయనమవనున్నారు.