నైస్ గా ఐస్ క్రీంకి ప్రచారకర్త గా కనిపించనున్న యామి గౌతం

Yami-Gouthami
యామి గౌతం కెరీర్ ప్రస్తుతం శరవేగంగా దూసుకుపోతుంది, ఇప్పుడు తన చేతినిండా కావలిసినన్ని బాలీవుడ్, తెలుగు, తమిళ్ ఆఫర్స్ ఉన్నాయి. ‘విక్కీ డోనార్’ సినిమా పెద్ద విజయం సాదించిన తరువాత ఆమె అలీ జాఫర్ సరసన ‘అమన్ కీ ఆషా’ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రానికి ఈ. నివాస్ దర్శకుడు. నీరజ్ పండే సహ నిర్మాతగానే కాక స్క్రిప్ట్ కుడా అందించాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లండన్లో జరుగుతుంది. తెలుగులో ఈమె రాధామోహన్ తీస్తున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’ లో లాయర్ గా కనిపించనుంది. అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరోగా పరిచయం కానున్నాడు.

ఇదిలా వుండగా ఈమె భారీ సంస్థల ప్రచారకర్తగా కనిపించాడానికి మొదటి ఎంపిక అయ్యింది. ఇప్పటివరకూ ఫెయిర్ అండ్ లవ్లీ,సామ్ సంగ్ గాలక్సీ, చేవ్రోలేట్ బీట్ మరియు కె.ఎఫ్.సిల యాడ్స్ లో మెరిసిన ఈ తార జాబితాలో ఇప్పుడు కార్నెట్టో ఐస్ క్రేంకుడా చేరింది. “మన చిన్నతనంలో తప్పకుండా రుచి చుసిన ఈ ఐస్ క్రీం సంస్థకు ప్రచారకర్తగా పనిచెయ్యడం చాలా సంతోషకరంగా ఉందని” ట్వీట్ చేసింది. ఈ ఐస్ క్రీమ్ యాడ్ ఇప్పటికే ఇంటర్నెట్లో విడుదల అయింది. ‘గౌరవం’ మరియు ‘అమన్ కి ఆషా’ చిత్రాలే కాక యామి గౌతం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మరియు ‘హమారా బజాజ్’ సినిమాలలో కనపడనుంది.

Exit mobile version