బాలీవుడ్ టాప్ హీరో సరసన చాన్స్ కొట్టేసిన యామి గౌతం

Ajay-and-Yami
విక్కీ డోనర్ తో హిందీలో హిట్ అందుకున్న యామి గౌతమ్ బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. త్వరలోనే ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ఓ సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా స్టొరీ, సినిమాలో తన పాత్ర ఏంటో ఇంకా తెలియకపోయినా యామికి మాత్రం ఇది బిగ్గెస్ట్ బాలీవుడ్ ఆఫర్ అని చెప్పుకోవాలి. యామి హీరోయిన్ గా చేస్తున్న సెకండ్ హిందీ సినిమా ‘అమన్ కి ఆశ’. ఈ సినిమాలో అలీ జాఫర్ హీరోగా నటిస్తున్నాడు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ప్రభుదేవా సినిమా జూలై లో సెట్స్ పైకి వెళుతుంది. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో యామితో పాటు సోనాక్షి సిన్హా కూడా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే విడుదలైన ‘గౌరవం’ సినిమా తర్వాత యామి గౌతమ్ ప్రస్తుతం నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలో నటిస్తోంది.

Exit mobile version