కోనా వెంకట్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ కథా రచయితలలో ఒకరుగా చేరిపోయారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘రెడీ’ మరియు ‘దూకుడు’ చిత్రాలకు ఒక కథా రచయితగా పనిచేశారు, ప్రస్తుతం ‘బాద్షా’ చిత్రానికి కూడా ఒక కథా రచయితగా పనిచేస్తున్నారు. స్వతహాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి అభిమాని కోనా వెంకట్. సల్మాన్ కోసం ఇప్పటికే ‘నో ఎంట్రీ 2’ చిత్ర కథను పూర్తి చేశారు మరియు త్వరలో ‘షేర్ ఖాన్’ అనే టైటిల్ తో ఒక కథను రాయనున్నారు. ఇటీవలే ఒక ప్రముఖ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయం ఇలా పంచుకున్నారు.
” ప్రతి ఒక్కరు నేర్చుకొని బ్లాక్ బెల్ట్ సంపాదించేయడానికి కథలు రాయడం అనేది మార్షల్ ఆర్ట్స్ కాదని ఆయన అన్నాడు. అది సహజంగా మనలో ఉండాలని, మీరు ఎంత కష్టపడి నేర్చుకున్నా అది రాదు ఎందుకంటే అది స్వతహాగా మీలో ఉంటేనే అది వీలవుతుందని ఆయన అన్నాడు. అలాగే ఒక స్టార్ హీరోకి కథ రాసేటప్పుడు అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథ రాయడంలో కథా రచయితకి పెద్ద కష్టం ఉండదు, అదే ఒక కొత్త హీరోకి కథ రాయడం మాత్రం చాలా కష్టతరమైన పని అని ఆయన అన్నాడు”. కొత్తగా కథా రచయితలు కావాలనుకున్న వారికి కోనా వెంకట్ చెప్పిన ఈ టిప్స్ బాగా ఉపయగాపడతాయని ఆశిద్దాం.