మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రమే “మాస్ జాతర”. ప్రీమియర్స్ తో ముందే సందడి చేసేందుకు వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాకి వరల్డ్ వైడ్ మంచి టార్గెట్ తోనే రాబోతున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది.
థియేట్రికల్ గా మాస్ జాతర 30 కోట్లకు పైగా షేర్ రాబడితే గట్టెక్కుతుందట. సో ఈ సినిమా ఎలా లేదన్నా 60 కోట్లకు పైగానే వసూళ్లు సాధించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
