ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘లోక చాప్టర్ 1’

Kotha-Lokah-2

ఇటీవల మలయాళ సినిమా అందుకున్న సంచలన విజయాత్మక చిత్రమే లోక చాప్టర్ 1 చంద్ర. దర్శకుడు డామినిక్ అరుణ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ క్రేజీ సూపర్ హీరో సినిమా తెలుగులో కొత్త లోక పేరిట విడుదలై మన దగ్గర కూడా మంచి వసూళ్లు అందుకుంది.

ఇక ఎట్టకేలకు ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా ఇవాళ్టి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి తప్పకుండా చూడవచ్చు. ఇక ఈ సినిమాలో శాండీ మాస్టర్, టోవినో థామస్ తదితరులు నటించగా దుల్కర్ సల్మాన్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version