వరల్డ్ వైడ్ మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ కొట్టిన ‘కాంతార 1’

Kantara-Chapter-1

రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార 1”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. మరి అలా అనుకున్నట్టు గానే కాంతార రికార్డు ఓపెనింగ్స్ సాధించినట్టు తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏకంగా 89 కోట్లకి పైగా గ్రాస్ ని ఓపెన్ చేసి కన్నడ సినిమా నుంచి రెండో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచింది. అలాగే రిషబ్ శెట్టి కెరీర్ లో కూడా అతిపెద్ద ఓపెనర్ గా రికార్డు సెట్ చేసింది. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా డెఫినెట్ గా మరింత స్థాయిలో నంబర్స్ ఈ చిత్రం సెట్ చేస్తుందని చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version