త్వరలో చరణ్ తో కలిసి చేస్తాను : రానా

Charan-Rana
గత రెండు గత రెండు దశాబ్దాలుగా తెలుగు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీరిలో ఏ ఇద్దరు హీరోలైనా కలిసి నటించిన సినిమా లేదు. మల్టిస్టారర్ సినిమాలు కూడా తగ్గిపోయాయి. అయితే వెంకటేష్, మహేష్ బాబు కలిసి ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించి మిగతా వారు కూడా మల్టిస్టారర్ సినిమాలు చేయడానికి బాట వేసారు ఇటీవల కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సక్సెస్ సాధించిన రానా త్వరలో చరణ్ తో కలిసి అంటున్నాడు. కృష్ణం వందే జగద్గురుం సినిమా ప్రమోషన్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన రానా త్వరలో చరణ్ తో కలిసి చేస్తానని ప్రకటించాడు చరణ్ తనకి చిన్ననాటి స్నేహితుడు అని అతనితో కలిసి పనిచేయాలని ఉందన్నాడు. సెల్వ రాఘవన్ తో కలిసి కూడా ఒక సినిమా చేయబోతున్నానని చెప్పాడు. భవిష్యత్తులో మరిన్ని మల్టిస్టారర్ సినిమాలు రావాలని కోరుకుందాం.

Exit mobile version