శేఖర్ కమ్ముల ప్రయోగం ఫలించేనా?

Shekar-Kammula

శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘అనామిక’. ఈ సినిమా హింది లో వచ్చిన ‘కహానీ’ చిత్ర రీమేక్. మంచి స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ‘కహానీ’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీసు దగ్గర మంచి ప్రశంసలు పొందింది.

ఈ కథను ఆధారంగా తీసుకుని శేఖర్ కమ్ముల తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకొని ‘అనామిక’ని రూపొందిస్తున్నారు. హిందీ లో విద్య బాలన్ నటించిన పాత్రలో, నయనతార నటించింది. హిందీలో గర్భవతిగా కనిపించే ఈ పాత్రా తెలుగులో సాధారణ మహిళ గానే కనబడబోతుంది.

మంచి స్క్రీన్ ప్లే, మంచి కథతో ఉన్న సినిమా లో మార్పులు చేసి శేఖర్ కమ్ముల తెలుగునాట విజయం సాధిస్తాడో లేదో వేచి చూడాలి. వేసవిలో రాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ రెండు భాషలో విడుదల కానుంది.

Exit mobile version