కొన్ని మర్చిపోలేని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో బి. గోపాల్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, ‘స్టేట్ రౌడీ’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’ మొదలైన ఎన్నో సినిమాలను ఆయన తెసారు. కానీ గత కొద్ది రోజులుగా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. ఆయన చివరగా తీసిన ‘మస్కా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేక నిరాశనే మిగిల్చింది.
కానీ ఇప్పుడు బి. గోపాల్ ఎంతో నమ్మకంతో మళ్ళీ సినిమా చేయడానికి సిద్దమయ్యారు. ఆయన తన తదుపరి సినిమా గోపీచంద్ తో చేస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు, ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘నా తదుపరి సినిమా గోపీచంద్ తో చేస్తున్నాను. అది యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని’ అన్నారు.
నందమూరి బాలకృష్ణతో ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని అడిగితే బి గోపాల్ సమాధానమిస్తూ ‘ నేను – బాలకృష్ణ కలిసాము అంటే అంచనాలు భారీగా ఉంటాయి. నేను ఇంకా ఆ సినిమా స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నాను. కచ్చితంగా బాలకృష్ణ గారితో మరో బిగ్ హిట్ అందుకుంటాను. ఆ హిట్ మునుపటి హిట్స్ కంటే పెద్దగా ఉంటుందని’ అన్నాడు.