మాస్ మహారాజ రవితేజ అయన కెరీర్లో చాలా కీలక దశలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయనకీ ఏది కలిసి రాలేదు “సారోచ్చారు” చిత్రం మీద అయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అయన రొటీన్ కి భిన్నంగా క్లాసి గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు.అశ్విని దత్ వంటి ప్రొడ్యూసర్ తో ఈ మధ్యనే సోలో వంటి హిట్ కొట్టిన పరశురాం దర్శకత్వంతో రవితేజ పాత రోజులు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ మధ్య విడుదలయిన ఆల్బం ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంది. కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో రవితేజ సరసన నటించారు. ఇప్పటికి అయితే ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది.