ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి-ప్రభాస్ మూవీ?

ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి-ప్రభాస్ మూవీ?

Published on Feb 5, 2020 8:07 AM IST

రాజమౌళి-ప్రభాస్ లది ఎంత పెద్ద సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్ వచ్చిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ కాగా బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ఆల్ ఇండియా ఆల్ టైం హిట్ గా నిలిచాయి. మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఐతే త్వరలో ఇది జరగనుందని ఓ వార్త ప్రచారం జరుగుతుంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాజమౌళి-ప్రభాస్ ల గురించి ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది.

ఆ కథనం సారాంశం ఏమిటంటే, త్వరలో ప్రభాస్ మరియు రాజమౌళి కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించనున్నారట. ఆ నిర్మాణ సంస్ధ నుండి మొదటి చిత్రంగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కించనున్నారట. దీని గురించి వీరిద్దరి మధ్య ఓ అవగాహన కూడా కుదిరిందని ఆ వార్త. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, టాలీవుడ్ ని ఊపేస్తోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి 2021 గాని ఫ్రీ కాడు. ఒక వేళ వీరిద్దరు కలిసి సినిమా చేసినప్పటికీ, అది 2021 తరువాతే ఉంటుంది.

తాజా వార్తలు