యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెన్నెల – మానస వీరిలో ఎవరిని ప్రేమిస్తాడు? కంగారు పడకండి! మిర్చి సినిమాలో అనుష్క వెన్నెలగా, రిచా గంగోపాధ్యాయ మానసగా నటిస్తున్నారు. మరి వీరిద్దరిలో ప్రభాస్ ఎవరిని ప్రేమించాడు అనేది కీలకం. ఇటలీలో ఆర్కిటెక్ట్ ఉద్యోగం చేస్తున్న జై పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఒక సమస్య కారణంగా ఇటలీ నుండి పల్నాడుకి తిరుగు ప్రయాణం అవుతాడు. ఆ సమస్య ఏంటి అనేది మిర్చి మూల కథ. రేపు భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ రచయిత నుండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన మిర్చి సినిమా మీద నిర్మాతలు వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి పూర్తి నమ్మకంగా ఉన్నారు.