అమీర్ ఖాన్ సినిమాపై గట్టి ఎఫెక్ట్ పడబోతుందా?

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇపుడు ఒక సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తన నుంచి రీసెంట్ ప్లాప్స్ తర్వాత వస్తున్న మరో చిత్రమే ‘సితారే జమీన్ పర్’. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ కి రీమేక్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమాపై నార్త్ ఆడియెన్స్ కి ప్రభావం పడేలా ఉందని తెలుస్తుంది.

మెయిన్ గా ఇటీవల జరిగిన పహాల్గమ్ దాడి సహా ఆపరేషన్ సిందూర్ పట్ల బాలీవుడ్ స్టార్స్ చూపించిన వైఖరి పట్ల ఆడియెన్స్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మరోలా ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. అప్పుడు స్పందించని అమీర్ ఖాన్ సరిగ్గా సినిమా రిలీజ్ ముందు మొసలి కన్నీరు కార్చితే ఎవరూ నమ్మరని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే రిలీజ్ రోజు అసలైన ఎఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాపై చూస్తారని అంటున్నారు. ట్రైలర్ కి అయితే మంచి స్పందనే వచ్చింది. మరి నిజంగానే దారుణమైన ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది ఈ రానున్న జూన్ 20తో తేలిపోతుంది.

Exit mobile version